Miryalaguda town, Ward 47, Miryalaguda, Nalgonda, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎంఎ.రషీద్ అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు రషీద్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, నివాళులర్పించారు.
రషీద్ మృతి పట్ల సంతాపం : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణం లోని 47వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ సానుభూతి పరుడు ఎంఎ.రషీద్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. రషీద్ మరణవార్త తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వారి నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రషీద్ మృతి బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలనిభగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో మనో ధైర్యం కలగాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. వారి వెంట ఎండి.ఇలియాస్ ఖాన్, ఎండి.అలీం, ఎండి.అసిం,సందేషి అంజన్ రాజు, గయాస్, నాహీద్, వాజిద్, మోయిద్, ఇమ్రాన్, తదితరులు ఉన్నారు.












