అసెంబ్లీ మీడియా పాయింట్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ కు ఎలాంటి చెడు ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
*కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. రేవంత్ రెడ్డి అభిమాని* *టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్* *మా సీఎం చిత్రపటానికి పిండ ప్రధానం చేస్తే మా ఎమ్మెల్యేకు కోపం రాదా..?* *కేసీఆర్ బాత్రూమ్లో జారీ పడితే గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వైద్యం* *కేసీఆర్కు చెడు జరగాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పూజలు* మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్కు చెడు జరగాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పూజలు చేశారని స్వయంగా కవిత చెప్పారని అన్నారు. తాము ఏరోజూ కేసీఆర్ చెడు కోరుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి చెడునూ కోరుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం పట్ల వేరే ఆలోచన లేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ బాత్రూమ్లో జారీ పడితే గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వైద్యం చేయించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆరోగ్యం గురించి అడిగిన సంగతి గుర్తులేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతను కాంగ్రెస్ గౌరవిస్తుందని చెప్పారు. 55 మంది సిబ్బందితో కేసీఆర్ పాంహౌస్ దగ్గర ప్రభుత్వం సెక్యూరిటీ పెట్టిందని మహేశ్ వెల్లడించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. రేవంత్ రెడ్డి అభిమాని అని.. ఆ అభిమానంతోనే ఆయన అలా మాట్లాడి ఉండొచ్చన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ నాయకులు పిండం పెట్టినప్పుడు తెలీదా అని ప్రశ్నించారు. మరి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కోపం రాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీరు దళిత సమాజాన్ని అవమానించే విధంగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.. *kp*












