4వ డివిజన్, గోదావరిఖని, రామగుండం, జగిత్యాల, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. 4వ డివిజన్లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు బుధవారం ర్యాలీ చేపట్టారు.
*ప్రగతి పథంలో ప్రజాపాలన* *ప్రజాపాలన 1000 రోజుల సంబరాలు – 4వ డివిజన్లో ఘనంగా ర్యాలీ* గోదావరిఖని: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు, నగర మేయర్ మహంకాళి స్వామి గారి ఆదేశాల మేరకు బుధవారం 4వ డివిజన్లో ప్రజాపాలన 1000 రోజుల సంబరాలను ఘనంగా నిర్వహించారు. 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ క్లస్టర్ కాల్వ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా 4వ డివిజన్ క్లస్టర్ కాల్వ లింగస్వామి, మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే విధంగా పాలన కొనసాగుతోందని అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, ఎస్టీపీలు తదితర అభివృద్ధి పనులను చేపడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందని, రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పోరేటర్ సత్యప్రసాద్, చేరుకు బుచ్చి రెడ్డి, వంగ వీరస్వామి, బాదం వసంత రవి, రసమళ్ళ కిరణ్, ఇనుగుల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...






