సారంగాపూర్, 8 September
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ డిమాండ్ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మల దహనం : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచనలతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్పెల్లి సురేందర్‌తో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, గ్రంథాలయ, ఆలయ కమిటీ చైర్మన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












