పెంబి, 8 September
శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) తాతా మధును వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, మండల కేంద్రంలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
*ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలి* అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దగ్ధం చేశామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో పండుకోకుండా అసెంబ్లీకి వచ్చి గౌరవ స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగినదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సెక్రటరీ స్వప్నిల్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మల్లెపల్లి సత్యనారాయణ స్వామి, వేణు నగర్ సర్పంచ్ టేకం భీమ్ రావు, నాగపూర్ సర్పంచ్ బోసు వెంకట రాములు, లంబాడి తండ సర్పంచ్ గంగాధర్, శెట్టిపల్లి సర్పంచ్ విట్టల్, సక్కిగుడా సర్పంచ్ శంకర్, దొందరి సర్పంచ్ రాజు పటేల్, కిస్తూ నాయక్ తండ సర్పంచ్ చంద్రబాబు, పులగంపండ్రి సర్పంచ్ నందు నాయక్, తాటి గూడా సర్పంచ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయడం జరిగినదని తెలిపారు.



