బాసర, 8 September
దళిత స్పీకర్ తల్లిని దూషించడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ ఘటనలను నిరసిస్తూ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దళిత స్పీకర్ తల్లిని దూషించడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానం దళిత స్పీకర్ తల్లిని దూషించడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ ఘటనలను నిరసిస్తూ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలను ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే వారిని 24 గంటల్లోగా పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై దాడికి పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


