మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో, ఎంపీడీవో, తహసిల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం, బస్టాండ్ మీదుగా రౌండ్ దాకా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో రమణారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో నోడల్ అధికారి ఎంపీడీవో శేషగిరి శర్మ, తహసిల్దార్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్చార్జిలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












