నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్లో గురువారం శిక్షణా కార్యక్రమం జరిగింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచుల విధులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో గురువారం ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచుల విధులు, గ్రామసభల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ నిధుల వినియోగం, పారదర్శక పరిపాలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ ఇన్చార్జి సుభాష్ యక్కర, రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జాతీయ శిక్షకుడు సుశీల్, కోఆర్డినేటర్ అరుణ్, జోనల్ కోఆర్డినేటర్ నవీన్ సర్పంచులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ కార్యక్రమానికి హాజరై సర్పంచులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని, బాధ్యతాయుతమైన పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ అచ్యుత్ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేరుగు భోజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కుర్మే అన్నపూర్ణ మహేందర్, యెల్మ రోహిణి వినయ్ రెడ్డి, పూండ్రు విజయ రాజారెడ్డి, బొజ్జ సాయన్న, పన్నాల షమేందర్ రెడ్డి, నారాయణ, సుద్దుల అరుణ్ రెడ్డి, ఆత్రం బాగీరథ, రాథోడ్ రమేష్, దేవిదాస్, ఆత్రం సునీత, దశరథ్, మంగళ రవి, మడావి లక్ష్మణ్, మడావి దేవ్రావ్, మడావి సుజాత, జల్పతి రావు, నీరజ పాండులా, ఆత్రం లలిత తదితరులు పాల్గొన్నారు.












