బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 19
మండలంలోని 21 గ్రామాలకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేరుగు భోజన్న తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని 21 గ్రామాలకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేరుగు భోజన్న తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత, తెలంగాణ రాష్ట్ర, జిల్లా నాయకత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నూతనంగా నియమితులైన గ్రామ అధ్యక్షులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా మేరుగు భోజన్న మాట్లాడుతూ, గ్రామస్థాయి కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమని ఆయన తెలిపారు. నూతన అధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. నూతనంగా నియమితులైన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఆశన్న, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మండల అధికార ప్రతినిధి అచ్యుత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కౌసర్, ప్రధాన కార్యదర్శి అబూద్, ఉమేష్ జాదవ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మేరుగు నరసింహాదాస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ చాట్ల ఉమేష్, మాజీ ఎంపీటీసీ షేక్, కాంగ్రెస్ నాయకులు బొజ్జ సాయన్న, అలీం, జగన్, అబ్రార్, అమీరోదిన్ తదితరులు పాల్గొన్నారు.












