తొగుట (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
మండలంలోని తుక్కాపూర్, గ్రామాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడటం హర్షదాయకమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 123 జీవోతో పాటు ప్యాకేజీ అందించాలని కోర్టు ఆదేశించడం స్వాగతించదగిన పరిణామమని ఆయన అన్నారు. ఈ తీర్పు నిర్వాసితుల పోరాటానికి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
*భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయం* - దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి *చెరుకు శ్రీనివాస్ రెడ్డి* మండలంలోని తుక్కాపూర్ , గ్రామాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ,తుక్కాపూర్ గ్రామ భూ నిర్వాసితులకు 123 జీవోతో పాటు R&R (పునరావాసం–పునరావాస పునరుద్ధరణ) ప్యాకేజీ అందించాలని కోర్టు ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూములు కోల్పోయి న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితుల పోరాటానికి ఈ తీర్పు ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. గతంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావు, సిద్దిపేటలో భూ నిర్వాసితులకు అందించిన పరిహారం స్థాయిలోనే ఇక్కడ కూడా పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని నెరవేర్చలేకపోతే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే స్థాయిలో కూడా ప్రకటించినప్పటికీ, భూ నిర్వాసితుల సమస్యపై ఇప్పటివరకు తగిన స్థాయిలో స్పందించలేదని విమర్శించారు. అలాగే, మాజీ మంత్రి హరీష్ రావు కూడా భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, అధికారంలో ఉన్న సమయంలో వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తుక్కాపూర్, తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు 123 జీవోతో పాటు R&R ప్యాకేజీ అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానం చేశారు *సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ* మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8,50,500/- రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. *ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి* వీరనారి చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో వున్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్,మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,డైరెక్టర్లు,భూ నిర్వాసితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












