పెంబి, 10 September
దళితులు నడిచిన నేలను శుద్ధి చేయాల్సిన అవసరం లేదని, కేసీఆర్ కుటుంబం మనస్సుల్లో పేరుకుపోయిన రాచరికపు అహంకారాన్ని, కుల వివక్షను, అంతరానితనాన్ని యూసిడ్ తో కడిగి శుద్ధి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ అన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమానించిన తీరును నిరసిస్తూ దళిత సమాజం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వైపు డప్పులతో కదిలిందని ఆయన పేర్కొన్నారు.
*శుద్ధి చేయాల్సింది దొర అహంకారాన్ని!* శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని, కేసీఆర్ కుటుంబం మనస్సుల్లో పేరుకుపోయిన రాచరికపు అహంకారాన్ని, కుల వివక్షను, అంతరానితనాన్ని యూసిడ్ తో కడిగి శుద్ధి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిసె రమేష్ యాదవ్ అన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమానించిన తీరును నిరసిస్తూ దళిత సమాజం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వైపు దప్పుదరువుతో ప్రజాస్వామ్యబద్ధంగా కదిలిందని, దీనికే ఫామ్ హౌస్ దారులను పసుపునీళ్లతో శుద్ధి చేశారంటే ఇంతకంటే అవమానం, క్రూరత్వం మరోటి లేదని అన్నారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో దళితులు డప్పులు కొడితే ఫామ్ హౌస్ మలినమైనదని పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసినందుకు నిరసనగా పావని గౌడ్ మరియు పద్మారావు లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు పెట్టి అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. "దళితులు అడుగుపెట్టిన ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న నేలంతా మైలపడడంతో కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నీళ్లతో శుద్ధి చేశాం అని చెప్పి.. ఆ ఫోటోలు, పేపర్లలో వచ్చిన వార్తలను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో బాహాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? మధ్యయుగాల నాటి చక్రవర్తులు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదు అని మండిపడ్డారు.












