దళితులను అవమానించిన బీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్పాలి ఎర్రవల్లి ఘటనపై మేరుగు భోజన్న తీవ్ర మనోరంజని తెలుగు టైమ్స్ ఎర్రవల్లిలో దళితులు వచ్చి వెళ్లిన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి చేశారనే ఘటన దళిత సమాజాన్ని తీవ్రంగా అవమానించే విధంగా ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరుగు భోజన్న తీవ్రంగా ఖండించారు. దళితులు మనుషులు కాదా దళితులు అడుగుపెట్టిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దళితులను ముందు పెట్టుకుని ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు అన్ని రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇచ్చారని భోజన్న గుర్తు చేశారు. ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా దళిత సమాజాన్ని మోసం చేశారని విమర్శించారు.ఎర్రవల్లి ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి దళితులకు క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితులను అవమానించిన బీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్పాలి
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- దళితులు మనుషులు కాదా దళితులు అడుగుపెట్టిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
- ఇలాంటి చర్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- దళితులను అవమానించిన బీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్పాలి ఎర్రవల్లి ఘటనపై మేరుగు భోజన్న తీవ్ర మనోరంజని తెలుగు టైమ్స్ ఎర్రవల్లిలో దళితులు వచ్చి వెళ్లిన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి చేశారనే ఘటన దళిత సమాజాన్ని తీవ్రంగా అవమానించే విధంగా ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరుగు భోజన్న తీవ్రంగా ఖండించారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దళితులను ముందు పెట్టుకుని ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు అన్ని రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇచ్చారని భోజన్న గుర్తు చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3450ఆర్టికల్స్
4,35,038వ్యూస్