Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
లోకేశ్వరంలోని వేదం పాఠశాలలో పూర్వ విద్యార్థుల విజయాలను అభినందిస్తూ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన సిబ్బుల సాయి కిరణ్, దర్శనం సుప్రజలను, అలాగే సీటు సాధించిన అర్ష నవ్యశ్రీని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
🌟 పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం 🌟 వేదం పాఠశాల – లోకేశ్వరంలో ఈరోజు పూర్వ విద్యార్థుల విజయాలను అభినందిస్తూ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద్యనభ్యసించిన సిబ్బుల సాయి కిరణ్ మరియు దర్శనం సుప్రజ లు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా, అర్ష నవ్యశ్రీ MBBS సీటు సాధించి వైద్య విద్యలో అడుగుపెట్టిన సందర్భంగా ఆమెను కూడా పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. వీరు గతంలో శ్రీ శారదా విద్యానికేతన్లో విద్యనభ్యసించి, నేడు తమ ప్రతిభతో ఉన్నత విజయాలను సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దడిగే రమేష్ సర్, కరస్పాండెంట్ దోడొల్ల మల్లేష్ సర్ మరియు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను సత్కరించి, వారి భవిష్యత్ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.












