ఎడపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్ మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో ఆట వస్తువులు చోరీకి గురైన విషయంపై ప్రధానోపాధ్యాయురాలు సునీతను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జెడ్పీ ఉర్దూ మీడియం పాఠశాలలో సర్పంచ్ తనిఖీ , సెప్టెంబరు 15: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్ మంగళవారం తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో ఆట వస్తువులు చోరీకి గురైన విషయం గురించి ప్రధానోపాధ్యాయురాలు సునీతతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పాఠశాలలోని వసతులను పరిశీలించారు. పాఠశాల భద్రత దృష్ట్యా అవసరమైన సీసీ కెమెరాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని సర్పంచ్ కందగట్ల రాంచందర్ తెలిపారు. పాఠశాలలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేసేందుకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముస్తాక్, అస్లాం, నాయకులు ఇషాక్, అసద్ తదితరులు పాల్గొన్నారు.












