జైనథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు, రైతులందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు* *ఆదిలాబాద్ జిల్లా లో అంగరంగ వైభవంగా పొలాల అమావాస్య వేడుకలు* *వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ* *ఉత్తమంగా అలంకరించిన ఎడ్లకు బహుమతులు అందజేసిన ఎస్పీ అఖిల్ మహాజన్* ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. రైతులు తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. లోని లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం రైతులు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి నిర్వహించిన వేడుకలను వీక్షించారు. రైతులు కలిసికట్టుగా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. వ్యవసాయంలో రైతులకు ఎంతో తోడ్పాటునందించే పశువులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమన్నారు. ఎడ్లను అత్యంత ఆకర్షణీయంగా అలంకరించిన రైతులకు గ్రామపంచాయతీ తరఫున ప్రకటించిన బహుమతులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఎస్ఐ పి.గౌతమ్, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












