లోకేశ్వరం, 10 September
మండలవ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. రైతు కుటుంబాలకు ఎంతో ప్రాధాన్యమున్న ఈ పండుగను మండలంలోని వివిధ గ్రామాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు.
పొలాల అమావాస్యకు పల్లెల్లో పండుగ శోభ సంప్రదాయబద్ధంగా పూజలు.. బసవయ్యలకు ఘనంగా ఊరేగింపు మండలం సెప్టెంబర్ 10 (మనోరంజని తెలుగు టైమ్స్) మండలవ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రైతు కుటుంబాలకు ఎంతో ప్రాధాన్యమున్న ఈ పండుగను మండలంలోని వివిధ గ్రామాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఇంటి దైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం భాజాభజంత్రీల నడుమ బసవయ్యలకు ఊరేగింపు చేపట్టారు. పండుగలో రైతులు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆచార సంప్రదాయాలను నేటి తరం కూడా కొనసాగించడం విశేషంగా నిలిచింది. పండుగ సందర్భంగా మండలంలోని పల్లెలన్నీ సందడిగా మారగా, కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు.












