బాసర, 10 September
మండలంలోని ఓని గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని రజక సోదరులు ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు సూచించారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి మండలం (మనోరంజని తెలుగు టైమ్స్) వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని ఓని గ్రామంలో రజక సోదరుల ఆధ్వర్యంలో గురువారం ఆమె చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల గంగాధర్, నాయకుడు బోజన్న మాట్లాడుతూ.. ఐలమ్మ చూపిన పోరాట పటిమ, పట్టుదల, ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులకు ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ రజక పెద్దలు, యువకులు, వార్డు సభ్యుడు జి.యోగేష్, దత్త హరి, లక్ష్మణ్, ఉషన్న, గణేష్, గంగాధర్, పోశెట్టి బిఆర్ఎస్ నాయకుడు శివన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












