ముధోల్, 10 September
మండలంలోని ఏడ్బిడ్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన : మండలంలోని ఏడ్బిడ్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దొరల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, భూమి, భుక్తి, విముక్తి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి. రామచంద్ర రెడ్డి, రజక జిల్లా సంఘం అధ్యక్షులు గంగన్న, డేవిడ్ గంగన్న, గ్రామ అధ్యక్షులు నవీన్, గజ్జ అన్న, రజక కుల సంఘం సభ్యులు కే. రాజారెడ్డి, పి. మాణిక్ రెడ్డి, చాకలి ముత్తన్న, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురు ప్రసాద్ కే. యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.












