బోత్, 10 September
బోథ్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి లో బి ఆర్ ఎస్ నాయకులు బోథ్ పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు తో కలిసి బోథ్ బిఆర్ ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన గొప్ప ఉద్యమకారుని చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఈ కార్యక్రమం లో బోథ్ పంచాయితీ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్,రమణ గౌడ్, వీడీసీ అధ్యక్షులు అల్లాకొండ పోతన్న, బి ఆర్ ఎస్ యూత్ ప్రెసిడెంట్ మేడిచెల్మ ప్రవీణ్,రమణ మరియు మాసం లక్ష్మి సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ వార్డ్ సభ్యులు కట్ట భూమేష్,కరిపె శ్రీనివాస్ మరియు రజక సంఘం నాయకులు రమేష్,గంగన్న,సంతోష్ ,,నరేష్ మరియు రజక సంఘ సభ్యులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.












