లక్ష్మణచాంద, 15 November
లక్ష్మణ్ చందా మండలంలోని రాచాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులో తన పొలంలో ఉన్న వేప చెట్టుకు నాయిడి రవీందర్ అనే వ్యక్తి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొత్త ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేసాడు. ఇప్పటికే ఒక ట్రాక్టర్ ఉండగా మరొకటి ఎందుకు కొన్నారని మృతుడి భార్య ప్రశ్నించడంతో, రెండు రోజుల కిందట వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. సాధారణంగా మొండి ప్రవర్తనతో ఉండే తన భర్త, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శ్రావణి తెలిపారు.
లక్ష్మణ్ చందా మండలంలోని రాచాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులో తన పొలంలో ఉన్న వేప చెట్టుకు నాయిడి రవీందర్ అనే వ్యక్తి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కొత్త ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేసాడు. ఇప్పటికే ఒక ట్రాక్టర్ ఉండగా మరొకటి ఎందుకు కొన్నారని మృతుడి భార్య ప్రశ్నించడంతో, రెండు రోజుల కిందట వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. సాధారణంగా మొండి ప్రవర్తనతో ఉండే తన భర్త, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI శ్రావణి తెలిపారు.






