నిర్మల్, 15 November
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులన్నీ ఎల్ నినో ప్రభావంతో రోజురోజుకు ఎండిపోతున్నాయి.
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులన్నీ ఎల్ నినో ప్రభావంతో రోజురోజుకు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. జూరాల ప్రాజెక్టులోకి రోజుకు కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. శ్రీశైలం నీటి నిల్వలు కూడా దారుణంగా పడిపోయాయి. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 49.3 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. నీటి మట్టం సుమారు 829.8830 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహం (ఇన్ ఫ్లో) దాదాపు సున్నా టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 140 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది కూడా ఆందోళన కలిగించే విషయమే.





