తానూర్, 15 November
నిర్మల్ జిల్లా మండలంలోని జవుల (బి) గ్రామం నుంచి మహారాష్ట్రలోని కపిలాధార్ వరకు 25 ఏళ్లుగా ఆధ్యాత్మిక పాదయాత్రను నిర్వహిస్తున్నారు. వీర్ మఠ్ సంస్థాన్ గురువర్య మల్లయ్య స్వామీ నేతృత్వంలో జరిగే ఈ యాత్రలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు.
నిర్మల్ జిల్లా మండలంలోని జవుల (బి) గ్రామం నుంచి మహారాష్ట్రలోని శిక్షేత్ర కపిలాధార్ వరకు ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాదయాత్రను అనువాయితిగా 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. వీర్ మఠ్ సంస్థాన్ గురువర్య మల్లయ్య స్వామీ నేతృత్వంలో ఈ పాదయాత్ర జవుల (బి) గ్రామం నుండి మహారాష్ట్రలోని శిక్షేత్ర కపిలాధార్ వరకు జరుగుతోంది. ఈ పాదయాత్రలో గ్రామస్తులు భక్తి, శ్రద్ధలతో పాల్గొంటారని భక్తులు తెలిపారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొని స్వామి వారికి దర్శనం చేసుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా మల్లయ్య స్వామీ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, యువత ఆధ్యాత్మిక రంగంలో రాణించాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. భక్తితో ముక్తి కలుగుతుందని చెప్పారు.






