హైదరాబాద్, 14 November
ఉస్మానియా యూనివర్సిటీలో మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో క్రాంతిపిత లహుజీ సాళ్వె 232వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లహుజీ సాళ్వె 232వ జయంతిని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సాధించాలనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి, వేలాదిమంది స్వాతంత్ర్య సమరయోధులను తయారుచేస్తూ, ఫూలే విద్యా ఉద్యమానికి రక్షణగా నిలుస్తూ, వివాహం చేసుకోకుండా జీవితాన్ని దేశానికి అంకితం చేసిన లహుజీ జయంతిని రాష్ట్రీయ స్వతంత్రత సంకల్ప్ దివస్ గా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్ మాట్లాడుతూ, లహుజీ సాళ్వె జీవిత చరిత్రను పాఠ్యంశంలో చేర్చాలని, మాంగ్ సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గురుకులాల్లో విద్యార్థులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని, ఉద్యోగ అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు కాంబ్లే సుధాకర్ మాంగ్, కాంబ్లే అనిల్ కుమార్ మాంగ్, చవాన్ ఉదయ్ మాంగ్, కాంబ్లే బాలాజీ మాంగ్, న్యాయవాది జాదవ్ గోపాల కృష్ణ మాంగ్, ఉస్మానియా విద్యార్థి నాయకులు మహేష్, సదానంద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

