మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీధర్ పథకం ద్వారా చేపట్టే పనులు, కల్పించే సౌకర్యాలపై కూలీలకు వివరంగా అవగాహన కల్పించారు.
ఉపాధి హామీ పథకం కింద పని చేయడానికి ఆసక్తి ఉన్న కూలీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. పనుల నిర్వహణ విధానం, కూలీలకు కల్పించే సౌకర్యాలు తదితర అంశాలపై ఆయన కూలీలకు వివరంగా అవగాహన కల్పించారు.
ముఖ్యంగా కొత్తగా జాబ్ కార్డులు అవసరమైన వారు తమ వివరాలను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ జాబ్ కార్డులు పొందేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో శివలింగం, టీఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.












