మండలంలోని శంకరయ్యకుంట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. సొంత గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు కానుండటంతో గ్రామంలో నూతనోత్సాహం నెలకొంది. ఇటీవల నూతనంగా ఏర్పాటైన శంకరయ్యకుంట గ్రామపంచాయతీకి వి.బి.జి. రామ్ నిధుల కింద నూతన భవన నిర్మాణానికి అనుమతులు రావడంతో ఆదివారం భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం నిర్మాణ పనులకు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం, తమ గ్రామానికి సొంత భవనం సమకూరనుండటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పరిపాలనకు ప్రత్యేక కార్యాలయం అందుబాటులోకి రానుండటంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శంకరయ్యకుంట సర్పంచ్ మాకు మహేష్, గోనెపల్లి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, కస్తూరిపల్లి సర్పంచ్ స్వామి, ఓబులాపూర్ సర్పంచ్ రేఖ, పరశురాములు, రాధిక, దేవరాజ్, ఏఈ తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశం, మల్లేశం, నాగరాజు, సత్యనారాయణ, జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు శ్యామల, గ్రామ గంగపుత్ర సంఘం పెద్దమనుషులు, భీష్మసేన యువజన సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
శంకరయ్యకుంటలో నూతన గ్రామపంచాయతీ
Share:

సారాంశం
భవన నిర్మాణానికి భూమిపూజ
ముఖ్య విషయాలు
- మండలంలోని శంకరయ్యకుంట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
- రామ్ నిధుల కింద నూతన భవన నిర్మాణానికి అనుమతులు రావడంతో ఆదివారం భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.
- సొంత గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు కానుండటంతో గ్రామంలో నూతనోత్సాహం నెలకొంది.
- ఇటీవల నూతనంగా ఏర్పాటైన శంకరయ్యకుంట గ్రామపంచాయతీకి వి.బి.జి.
