మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో డబల్ బెడ్ రూమ్లు (ఇందిరమ్మ ఇళ్ల) పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ నగర్లో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూములు ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 6వ తేదీన రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా సభా ప్రాంగణం, వేదిక ఏర్పాటు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని,అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ సజావుగా,పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కృషి చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎస్ రమణారెడ్డి, కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
6 న డబుల్ బెడ్ రూమ్ లు ఇండ్ల ప్రారంభం.."4" గురు మంత్రులు రాక :
Share:

సారాంశం
మిర్యాలగూడ మండలం
ముఖ్య విషయాలు
- శ్రీనివాస్ నగర్లో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూములు ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 6వ తేదీన రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో డబల్ బెడ్ రూమ్లు (ఇందిరమ్మ ఇళ్ల) పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆదేశించారు.
- సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4478ఆర్టికల్స్
5,39,032వ్యూస్










