తెలంగాణలో రైతులు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు తప్పడం లేదని, పంటలు చేతికొచ్చేకరెంటు, సాగునీరు కీలక సమయంలో విద్యుత్ సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారంటూ ఆరోపించారు.
బొగ్గు దిగుమతులపై ఆరోపణలు
సింగరేణికి బొగ్గు దిగుమతి విషయంలో అక్రమాలు జరిగాయంటూ విఠల్‌రావు ఆరోపణలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, ఎరువులు, పురుగు మందులు, కొనుగోలు కేంద్రాలు వంటి పలు సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. గత కేసీఆర్ హయాంలో చెరువుల పూడికతీత, మరమ్మతులు చేపట్టడంతో పాటు రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు.
రైతుల ఆందోళనలు
ప్రస్తుతం విద్యుత్ సమస్యలపై రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి వంటి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మామిడిపల్లి, కామరపల్లి , నందిపేట ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారని పేర్కొన్నారు.
గత కేసీఆర్ హయాంలో విద్యుత్ సరఫరాపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిరంతరం సమీక్షలు జరిగేవని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలపై తగినంతగా దృష్టి సారించడం లేదని విమర్శించారు.
బొత్ర లాజిస్టిక్ కంపెనీ ద్వారా సుమారు గా 3 వెల కోట్లు ముడుపులు బట్టి రేవంత్ రెడ్డి కలిసి తీసుకున్నట్లు ప్రజలు ఆరోపించారు దీనికి కేటీఆర్ రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.
ప్రభుత్వానికి డిమాండ్
నిజామాబాద్ జిల్లా రైతులకు పంటలు చేతికొచ్చే వరకు సక్రమంగా సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని వర్గాల ప్రజలు, రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, బీఆర్ఎస్ జిల్లా రైతు నాయకులు మారుతి, సాయిలు రాహుల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.












