భైంసా పట్టణం, భైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) అక్టోబర్ 22
భైంసా పట్టణంలోని పశువుల సంతలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పనులకు శ్రీకారం చుట్టారు.
భైంసా పట్టణంలోని పశువుల సంతలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం, మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఆధ్వర్యంలోని పాలకవర్గం పదవీకాలం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతులకు అందించిన సేవలను, మార్కెట్ కమిటీ అభివృద్ధికి చేసిన కృషిని అభినందించారు. రైతుల సంక్షేమం కోసం చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ చేసిన సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
పదవీకాలం ముగింపు సందర్భంగా చైర్మన్ సిందే ఆనందరావు పటేల్‌ను ఘనంగా సన్మానించారు. అలాగే, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు, ప్రతినిధులను కూడా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మోల్ల దత్తాత్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












