తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం రైతు నేస్తం కార్యక్రమాన్ని బెల్తరోడా రైతు వేదికలో నిర్వహించనున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి అంబాదాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రబీ సీజన్లో పంటల ప్రణాళిక, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
బొల్సా రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని బెల్తరోడా రైతు వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్లో పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, అనువైన పంటల ఎంపిక, సాగు విధానాలు, పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రైతులు ఉదయం 10:30 గంటలకే బెల్తరోడా రైతు వేదికకు చేరుకోవాలని ఆయన కోరారు. స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, బొల్సా రైతు వేదిక క్లస్టర్ సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












