సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులకు బ్యాగులు, చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఇంటి నుండే పరిశుభ్రత పాటించడం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సర్పంచ్ దండు సాయన్న సూచించారు.
అడెల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ దండు సాయన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామస్తులకు పంపిణీ చేసిన బ్యాగులు, చెత్తబుట్టలను ఉపయోగించుకుని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య నిర్మాణానికి ప్రతి ఇంటి నుండీ పరిశుభ్రత పాటించడం అత్యవసరమని సర్పంచ్ దండు సాయన్న ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పంపిణీ కార్యక్రమంలో అడెల్లి చైర్మన్ సింగం బోజగౌడ్, ఎంపీఓ అజిజ్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి రజితతో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.












