యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం రాంపూర్ గ్రామంలో మాదిగ విద్యార్థిని, విద్యార్థులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) నూతన బాయ్స్, గర్ల్స్ కమిటీలు ఎన్నికయ్యాయి. వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకోవాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం రాంపూర్ గ్రామంలో ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఎస్ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) గ్రామ, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా మాదిగ విద్యార్థిని, విద్యార్థులతో సమావేశం జరిగింది. ఈ సమావేశం ఎంఎస్పీ మండల అధ్యక్షులు జిట్ట యాదగిరి మాదిగ, ఎమ్మార్పియస్ నియోజకవర్గ నాయకులు గురుకు యాదగిరి మాదిగల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పియస్ ఆలేరు నియోజకవర్గం ఇంచార్జీ, ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగ జాతి కోసం త్యాగం చేసి, అలుపెరుగని పోరాటం చేసి వర్గీకరణ ఫలాలు సాధించారని తెలిపారు. వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్క మాదిగ, ఉపకులాల విద్యార్థి అందిపుచ్చుకోవడం కోసం ఉన్నతంగా చదువుకోవాలని, ఎవ్వరూ చదువులో డ్రాపౌట్ కావద్దని సూచించారు. విద్యా సంస్థల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎంఎస్ఎఫ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని, తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని తెలియజేశారు.
నూతన కమిటీల ఎన్నిక
అనంతరం ఎంఎస్ఎఫ్ బాయ్స్ కమిటీ, గర్ల్స్ కమిటీలు ఎన్నిక చేయడం జరిగింది. ఎంఎస్ఎఫ్ బాయ్స్ కమిటీ అధ్యక్షులుగా బూడిద పవన్ మాదిగ, అధికార ప్రతినిధిగా గురుకు జశ్వంత్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బూడిద మనోజ్ కుమార్ మాదిగ, ఉపాధ్యక్షులుగా గాదె క్రాంతి మాదిగ, కార్యదర్శిగా జిట్టా శ్రీమంజునాథ మాదిగ, కార్యవర్గ సభ్యులుగా గంధమల తనుష్ మాదిగ, గురుకు జయాంశ్ మాదిగ, బూడిద విశాల్ మాదిగ, గంధమల తేజ మాదిగ, చింతల ఫన్నీ మాదిగ ఎన్నికయ్యారు.
ఎంఎస్ఎఫ్ గర్ల్స్ కమిటీ అధ్యక్షులుగా బూడిద లోకేశ్వరి మాదిగ, అధికార ప్రతినిధిగా జిట్టా ఛాయశ్రీ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బూడిద భవిత మాదిగ, ఉపాధ్యక్షులుగా బూడిద స్నేహ మాదిగ, కార్యదర్శిగా జిట్టా యమునాశ్రీ మాదిగ, కార్యవర్గ సభ్యులుగా గంధమల ధనలక్ష్మి మాదిగ, గురుకు సంహిత మాదిగ, బూడిద లోహిత మాదిగ, గంధమల జాను మాదిగ లు ఎన్నికయ్యారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ ఆలేరు నియోజకవర్గం ఇంచార్జీ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు జిట్టా యాదగిరి మాదిగ, ఎమ్మార్పియస్ సీనియర్ నాయకులు గురుకు యాదగిరి మాదిగ, బూడిద ఆంజనేయులు మాదిగ, మండల నాయకులు బూడిద నర్సింహ్మా మాదిగ, గురుకు విజయ్ మాదిగ, బూడిద విజయ్ మాదిగ, పత్తెపురం వంశీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.












