పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సిద్దూర్ గ్రామస్థులు ఒక ఆదర్శవంతమైన చర్య చేపట్టారు. గ్రామంలో జరిగిన దుర్గామాత అన్నప్రసాద కార్యక్రమంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వాడేందుకు దాతలు ముందుకు వచ్చారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే సంకల్పంతో స్టీల్ ప్లేట్లను అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి డి. సురేష్, ఎం. దుర్పతి బాయి (సుధాకర్), సర్పంచి బాపూజీ, నరేష్ (మిర్జాపూర్), బాలు, ఆకాష్ స్టీల్ ప్లేట్లను అందించి సహకరించారు.
అలాగే పాఠశాల అవసరాల కోసం ప్రవీణ్, శ్రీకాంత్, భూషణ్ కూడా స్టీల్ ప్లేట్లను అందజేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అవసరమని గ్రామస్థులు పేర్కొన్నారు.
పర్యావరణ హితమైన ఇటువంటి కార్యక్రమాలు ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన దాతలకు కార్యక్రమ నిర్వాహకులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












