భూగర్భ జలాలను పెంపొందించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు చర్చించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి కారణాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్పిట్లు, ఫామ్ పాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు బోర్వెల్ రీచార్జ్ పనులను చేపట్టాలని అధికారులు సూచించారు. నీటి సంరక్షణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టాలని తెలిపారు.
అవగాహన కల్పించాలి
గ్రామాల్లో ప్రజలకు నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో రామకృష్ణ, డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీవో సల్మాన్‌రాజ్, ఇన్చార్జి ఏపీవో అనిల్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.












