ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంజులాపూర్ లోని వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పతాని నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు కేక్ కట్ చేశారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పతాని నర్సయ్య ఆధ్వర్యంలో మంజులాపూర్ లోని వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు మహేశ్వర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తమ ఆశీర్వాదాలు మహేశ్వర్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల రామనాథ్, మంతెన గంగారెడ్డి, కాల్వ నరేష్, అంబాజీ నాయక్, కంకట శ్రావణ్, సాహెబ్ రావు, బడిపోతన్న, ఎల్లన్న, సాగర్ రెడ్డి, కొప్పుల నరసయ్య, మధు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.












