మండల కేంద్రంలో కోతులు, వీధి కుక్కలు, రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సామాజిక సేవకుడు సీహెచ్. రాజేశ్ కుమార్ ఛత్రపతి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
మండల కేంద్రంలో కోతులు, వీధి కుక్కలు, రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక సేవకుడు సీహెచ్. రాజేశ్ కుమార్ ఛత్రపతి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులు, వృద్ధులు సహా రోడ్లపై ప్రయాణించే ప్రజల భద్రత దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవుల వల్ల ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.
ప్రజావాణి నోడల్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అరుణ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారుల సమక్షంలో వినతిపత్రం అందజేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం లభించే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తానని రాజేశ్ కుమార్ ఛత్రపతి తెలిపారు.
ప్రజల ప్రాణాలు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ సంబంధిత అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు.

