భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన లశెట్టి నర్సయ్య అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పోస్టులను సహించేది లేదని సంఘం నాయకులు హెచ్చరించారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన లశెట్టి నర్సయ్య అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం .
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ, లశెట్టి నర్సయ్య తన ఫేస్బుక్ ఖాతాలో అంబేద్కర్ ను అవమానిస్తూ పోస్టులు పెట్టారని తెలిపారు. ఇలా ఎవరైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో కించపరిచే విధంగా పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిని వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కుంటోళ్ల వెంకటస్వామి (రాష్ట్ర ఉపాధ్యక్షులు), ఎలమల రాజేశ్వర్, కొంతం గణేష్ (మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు), ఈ పురుషోత్తం, మసీదు రమేష్, జిల లింగయ్య, హరీష్ ధ్యాన్ గాపూర్ (ఉప సర్పంచ్), ముత్తన్న టింబర్ (ఉపసర్పంచ్), మదస్తు భూమేష్, కోట రాములు, ఎ భూమయ్య, నితీష్, రవి, వినోద్ తదితర నాయకులు పాల్గొన్నారు.












