ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు.












