నిర్మల్ జిల్లా మండలం బోసి గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యాహక్కు పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్ఫారం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, పిల్లలను పనుల్లోకి పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
బడిబయట ఉన్న పిల్లలను తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సంజయరావు, ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి గోపీనాథ్, అంగన్వాడీ కార్యకర్త మీనాక్షి, కరోబారి ప్రసాద్, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
నిరంతర ప్రయత్నాలు
డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దత్తు కాస మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామస్థాయిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.












