తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండలం యాకర్పెల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుమన్‌కు చార్జింగ్ ఆటోను అందజేశారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా ఇన్చార్జి వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కలిసి ఆటోను అందజేశారు. దివ్యాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాహనాన్ని అందించినట్లు తెలిపారు. చార్జింగ్ ఆటో ద్వారా సుమన్ ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి వినూత్న, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామ్‌చందర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఇన్చార్జి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుడికి చార్జింగ్ ఆటో అందజేత
Share:

సారాంశం
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండలం యాకర్పెల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుమన్‌కు చార్జింగ్ ఆటోను అందజేశారు.
ముఖ్య విషయాలు
- తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండలం యాకర్పెల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సుమన్‌కు చార్జింగ్ ఆటోను అందజేశారు.
- ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా ఇన్చార్జి వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కలిసి ఆటోను అందజేశారు.
- దివ్యాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాహనాన్ని అందించినట్లు తెలిపారు.
- చార్జింగ్ ఆటో ద్వారా సుమన్ ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3706ఆర్టికల్స్
4,55,870వ్యూస్










