మండలం కౌట్ల (బి) గ్రామంలో గురువారం భూ రీ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, సర్వేయర్ వెంకటరమణ, సర్పంచ్ బల్గూర్ అజయ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఈ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని మాజీ ప్రజాప్రతినిధులు సూచించారు.
మండలం కౌట్ల (బి) గ్రామంలో గురువారం భూ రీ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, సర్వేయర్ వెంకటరమణ, సర్పంచ్ బల్గూర్ అజయ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. రీ సర్వేను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మైపాల్‌రెడ్డి సూచించారు. భూ వివాదాలు తలెత్తకుండా, అందరికీ న్యాయం జరిగేలా సర్వేను పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ రాజేశ్వర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఇప్ప శ్రీకాంత్ రెడ్డి , అధికారులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. సర్వే ప్రక్రియను వారు పరిశీలించారు.












