బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) అక్టోబర్ 13
పత్తి సాగులో అధిక దిగుబడి సాధించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు నూజివీడు సీడ్స్‌కు చెందిన ఆధ్య 1134 మెగా పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు ఇట్టిడి మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ ప్రదర్శనను చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు రైతులు సందర్శించారు.
పత్తి సాగులో అధిక దిగుబడి సాధించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు నూజివీడు సీడ్స్‌కు చెందిన ఆధ్య 1134 మెగా పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు ఇట్టిడి మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ ప్రదర్శనను చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు రైతులు సందర్శించి పంట ఎదుగుదల, కాయల సంఖ్యను పరిశీలించారు. ఈ సందర్భంగా నూజివీడు సీడ్స్ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, టీమ్ లీడర్ జైకుమార్‌లు పత్తి రకం ప్రత్యేకతలను వివరించారు. ఈ రకం త్వరగా కాపుకు రావడంతో పాటు రెండో పంట సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వివిధ రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, చీడపీడలు, టొబాకో స్ట్రీక్ వైరస్‌ను తట్టుకునే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అధిక వర్షాలు, బెట్ట పరిస్థితులను తట్టుకుంటూ మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఎకరాకు దిగుబడిని పెంచుకోవచ్చని వివరించారు.
రైతు మోహన్ రెడ్డి పొలంలోని పత్తి మొక్కలకు సగటున 60 నుంచి 84 వరకు కాయలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత పంట పరిస్థితులను బట్టి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. పంట ఎదుగుదలను ప్రత్యక్షంగా పరిశీలించిన రైతులు ఆసక్తి కనబరిచారు. ఈ క్షేత్ర ప్రదర్శన ద్వారా పత్తి సాగులో వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం, దిగుబడి పెంపునకు అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, డిస్ట్రిబ్యూటర్ కత్తూరి శ్రీకాంత్, మార్కెటింగ్ ఆఫీసర్ సాడిగే మహేందర్, రైతులు పాల్గొన్నారు.












