బోథ్ మండలం పరిధిలోని నిగిని, బాబేర తండా, కైలాస్ టెక్డి గ్రామాలలో శనివారం న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సదస్సులలో బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కే సందీప్ కుమార్ ఆదివాసీ ప్రజలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి కే సందీప్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే తమ మనుగడకు అవసరమైన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ, పల్లె, గ్రామీణ ప్రజలు తమ ప్రాంతంలోని పచ్చని ప్రకృతిని కాపాడుకోవాలని, అడవి అమ్మ వంటిదని, ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ న్యాయ అవగాహన సదస్సులలో ఏజీపీ పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్, లింభాజీ మహారాజ్, సర్పంచులు రూప్ చంద్, జాదవ్ పద్మా రవి, మాజీ సర్పంచ్ బద్రు, బండు పటేల్, జైత్రం, గంగయ్య బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.











