వినాయక చవితి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ఉప సర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెలమ సంఘం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
వినాయక చవితి సందర్భంగా మండల కేంద్రంలోని వెలమ సంఘంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉప సర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి సుధాకర్‌రావు, పనీల్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఉప సర్పంచ్ అన్నప్రసాదాన్ని అందించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.












