మమడ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతీ యువకులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
మమడ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువతీ యువకులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో మమడ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.












