మండలంలోని అష్టా గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మున్నూరు కాపు గణేష్ మండలి, గణపతి పూజను దీపారాధన, నైవేద్యాలు, అభిషేక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించింది. గురుస్వామి సునీల్ దత్, శ్రీకాంత్ నేరడిగొండ నేతృత్వంలోని ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన ఆధ్యాత్మిక భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో గణేష్ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుల లావణ్య, శ్రీనివాస్ దంపతులు పూజలో పాల్గొని అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్నూరు కాపు గణేష్ కమిటీ యువకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అష్టా గ్రామంలో ఘనంగా గణపతి పూజ
Share:

సారాంశం
మండలంలోని అష్టా గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మున్నూరు కాపు గణేష్ మండలి, గణపతి పూజను దీపారాధన, నైవేద్యాలు, అభిషేక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3706ఆర్టికల్స్
4,55,949వ్యూస్









