ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని జామ్ గ్రామంలో ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగంగా ఘనంగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సనాతన సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించాలనే సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది.
జ్ఞానం, ధర్మం, శుభాలకు ప్రతీకగా భావించే దీపాన్ని వెలిగించడం ద్వారా, దేశ నిర్మాణంలో నిరంతరం కృషి చేస్తున్న మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రం శివ, మహేందర్, తేజ, అజయ్, నాని, రవితో పాటు పలువురు హిందూ బంధువులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











