నారాయణపేట, 9 September
ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామి, మధ్యవర్తి కమ్మరి నాగేశ్‌లపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంటి రిజిస్ట్రేషన్‌కు రూ.90 వేల లంచం.. సబ్ రిజిస్ట్రార్‌పై ఏసీబీ : ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామితో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేశ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ న నాగేశ్ ద్వారా రూ.50 వేలు ముందస్తుగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.40 వేల కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారిక విధులను దుర్వినియోగం చేసి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరిపై కేసు నమోదు చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.












