ఉత్తరప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
వరుస మరణశిక్షల తీర్పులతో వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి రవికుమార్ మరోసారి సంచలన తీర్పు ఇచ్చారు. 2018లో భార్యకు నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుడు నదీమ్ (38)కు తాజాగా ఉరిశిక్ష విధించారు. దీంతో ఆయన విధించిన మరణశిక్షల సంఖ్య 23కు చేరింది.
23వ ఉరిశిక్ష.. వెనక్కి తగ్గని న్యాయమూర్తి ఉత్తరప్రదేశ్: వరుస మరణశిక్షల తీర్పులతో వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్ న్యాయమూర్తి రవికుమార్ మరోసారి సంచలన తీర్పు ఇచ్చారు. 2018లో భార్యకు నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుడు నదీమ్ (38)కు తాజాగా ఉరిశిక్ష విధించినట్లు సమాచారం. దీంతో ఆయన విధించిన మరణశిక్షల సంఖ్య 23కు చేరింది. ఇప్పటికే నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీర్పుల నేపథ్యంలో అధికారులు సుమారు 100 కేసులను ఇతర న్యాయస్థానాలకు బదిలీ చేసినట్లు సమాచారం. అయితే తన న్యాయపరమైన సూత్రాల విషయంలో వెనక్కి తగ్గబోనని రవికుమార్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను న్యాయమూర్తి కుర్చీలో ఉన్నప్పుడు కేసులపై నిర్ణయం తీసుకునే అధికారం తనదేనని పేర్కొన్నట్లు సమాచారం.












