షాద్‌నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేరాలు, దర్యాప్తులు, కోర్టు వ్యవహారాలు, పరిపాలనా రికార్డులను ఆయన సమగ్రంగా సమీక్షించారు.
*షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్* *పెండింగ్ దర్యాప్తులు, కీలక కేసులపై సమీక్ష..* *సకాలంలో దర్యాప్తులు పూర్తి చేయాలని ఆదేశం* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసి నేరాలు, దర్యాప్తులు, కోర్టు వ్యవహారాలు, పరిపాలనా రికార్డులను సమగ్రంగా సమీక్షించారు. తనిఖీలో భాగంగా కార్యాలయ రికార్డులతో పాటు గ్రేవ్ (UI) కేసులు, ఎస్సీ/ఎస్టీ కేసులు, పెండింగ్ దర్యాప్తులు, మహిళలు మరియు పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులు, కోర్టు వ్యవహారాలు, ప్రివెంటివ్ పోలీసింగ్ రికార్డులను కమిషనర్ పరిశీలించారు. పెండింగ్ దర్యాప్తుల పురోగతి, ముఖ్యమైన కేసుల స్థితిగతులను సమీక్షించిన డా. తరుణ్ జోషి.. కేసుల దర్యాప్తును నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, కోర్టు కేసులపై సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని సూచించారు. మహిళలు, పిల్లలు, ఇతర సున్నితమైన కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రివెంటివ్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. పెండింగ్ కేసులను క్రమబద్ధంగా పర్యవేక్షిస్తూ అనవసర జాప్యం లేకుండా దర్యాప్తులను తార్కిక ముగింపుకు తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో షాద్‌నగర్ జోన్ డీసీపీ శ్రీమతి చ. సిరిష, షాద్‌నగర్ ఏసీపీ శ్రీ ఎస్. లక్ష్మీనారాయణతో పాటు ఏసీపీ కార్యాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..












