బిజెపి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
మిర్యాలగూడ వన్ టౌన్ లో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగభూషణంరావుకు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు.
ఆకాతాయిలను అరికట్టాలని సిఐ నాగభూషణంరావు బీజేపీ వినతి : మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ ఒన్ టౌన్ లో ఆకాతాయిలను అరికట్టాలని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ఎం.నాగభూషణంరావుకువినతిపత్రాన్ని మిర్యాలగూడ ఒన్ టౌన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బంటుగిరి, కొంగరి వెంకటరమణ మంగళ వారం అందజేశారు. వారు మాట్లాడుతూ ఒన్ టౌన్ లోని కళాశాలలవద్ద ఆకతా యిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది వీరి ఆగడా లకు విద్యార్థిని విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందు లకు గురవు తున్నా రన్నారు. ఈ ఆకతా యిల ఆట కట్టించి వీరి బారి నుండి విద్యార్థిని విద్యార్థులకు ఉపశ మనం కల్పించా లని,అలాగే పట్టణం లోని కళాశాలల వద్ద పాఠశాలల వద్ద టెంపుల్స్ వద్ద ఉన్న బెల్ట్ షాపులను నియంత్రించి పట్టణ శివారు ప్రాంతాలైన తాళ్లగడ్డ బోటింగ్ పార్క్ శివాలయం, అగ్రిగోల్డ్ వెంచర్ ప్రాంతాలలో విచ్చలవిడిగా ఓపెన్ ప్రాంతాలలో మద్యం సేవిస్తూ ప్రశ్నించిన వారిని బెదిరింపు చర్యలకు పాల్పడుతూ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అసాంఘిక శక్తులపై పోలీసు శాఖ ఉక్కుపాదంమోపి వీరి భారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపా ధ్యక్షులు బంటు యాదగిరి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు బొట్టు సోములు, ఒన్ టౌన్ ఉపాధ్యక్షుడుమునగాల శివ, తునికిపాటి శశికాంత్, బాణావత్ సందీప్ పాల్గొన్నారు.












